ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి ఛత్తీస్‌గఢ్‌తో ఆంధ్రా పోరు

-123 నిమిషాల క్రితం

నేటి నుంచి ఛత్తీస్‌గఢ్‌తో ఆంధ్రా పోరు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 02:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ములపాడుకు మారిన వేదిక

మూలపాడు : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక పోరుకు ములపాడు సిద్ధమైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరగాల్సి ఉండగా.. అక్కడ జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతులు లభించకపోవడంతో చివరి నిమిషంలో వేదికను మార్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని విజయవాడ సమీప ములపాడు 'డీవీఆర్' మైదానంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఇది హోమ్ మ్యాచ్ అయినప్పటికీ, వేదిక మారడంతో ఆంధ్రా జట్టుకు సొంతగడ్డపై ఆడే అదనపు అడ్వాంటేజ్ లభించనుంది. రిక్కీ భుయ్ సారథ్యంలోని ఆంధ్రా జట్టు ఈ మ్యాచ్‌లో బలమైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్