ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాష్ట్రంలో రూ.2,500 కోట్ల బిఇఎల్‌ పెట్టుబడి

1 గంట క్రితం

Massive Chemical Plant on Visakhapatnam-Kakinada Coast — Lokesh Invites Russian Giant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి లోకేష్‌

​ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ​రాష్ట్రంలో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్ధికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బిఇఎల్‌) రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 914 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి రక్షణ రంగ పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆదివారం ఎక్స్‌‌లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఇఎల్‌ ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన రక్షణ పరికరాల తయారీకి సంబంధించిన కార్యకలా పాలను చేపట్టనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు తో రాయలసీమ ప్రాంతంలో రక్షణ రంగానికి సంబంధించిన పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్