సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో రికార్డు

1 గంట క్రితం

Not just talent: Coach explains Vaibhav's selection
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెండు అర్ధశతకాలతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపిక

ముంబయి: 15ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 196.10 స్ట్రైక్ రేట్‌తో 151 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో వైభవ్ తన పేరిట నమోదు చేసిన అరుదైన రికార్డుల నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత పిన్న వయసులో అర్ధసెంచరీ కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సూర్యవంశీ 15 ఏళ్ల 118 రోజుల వయసులో అర్ధశతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్