లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ 2027 సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-వెల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇసిబి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా పురుషుల జట్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జూన్ 18న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక మహిళల ఏకైక టెస్ట్ సిరీస్ మ్యాచ్ జూన్ 24న హెడింగ్లీలో ప్రారంభమౌతుందని తెలిపింది. సౌథాంప్టన్‌లో వచ్చే ఏడాది తొలిసారిగా యాషెస్ సిరీస్ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. జులై 21న సౌథాంప్టన్ నాల్గో టెస్ట్‌కు ఆతిథ్య ఇవ్వనున్నట్లు.. మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జరగనున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది.
Print Editionయాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)