గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నా హజారే మౌన దీక్ష‍

1 గంట క్రితం

Anna Hazare's silent protest fast
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ‘మౌన్‌ ఆందోళన్‌’ (మౌన దీక్ష‍) చేపట్టారు. మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఆయన ఈ దీక్ష‍ చేపట్టారు. ఆ తర్వాత తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి హజారే బయలుదేరి వెళ్లారు. కాగా, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా బుధవారం అన్నా హజారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విద్యార్థులపై హింస, పోలీసుల చర్యలు అత్యంత బాధాకరమైనవిగా పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా కాకుండా, సమాజపు ఆవేదనగా చూడాలన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ప్రభుత్వ పతనానికి ఏమీ దారితీయదు కదా?..పైగా, అది... ప్రభుత్వ పనితీరును మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేస్తుందని ఆయన హితవు పలికారు. విద్యార్థులతో చర్చలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్