నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌కు భారతజట్లు..
టోక్యో: ఆసియా గేమ్స్-2026 క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా ఈవెంట్‌లో ఆసియాలోని 10 అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పతకాలకోసం పోటీపడనున్నాయి. ఐసిసి టాప్-10 ర్యాంక్‌లో ఉన్న ఆసియా ఖండ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించగా.. గత ఎడిషన్‌లో స్వర్ణ పతకాలను గెలుచుకున్న భారత పురుషుల, మహిళల జట్లు ఈసారి కూడా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతాయి. ఆసియా గేమ్స్ అధికారికంగా సెప్టెంబర్ 19న ప్రారంభం కానుండగా.. రెండ్రోజుల ముందే క్రికెట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. టి20 ఫార్మాట్‌లో ఆసియా గేమ్స్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మహిళల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 17న ప్రారంభమై, సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతాయి.
భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై అక్టోబర్ 3న ముగుస్తాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-4 సీడెడ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్‌లు దక్కాయి. మిగిలిన ఆరు జట్లు నాలుగు స్థానాల కోసం ప్రిలిమినరీ రౌండ్లలో తలపడతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరగా.. గ్రూప్-ఎ, బిలలో టాప్-2లలో నిలిచిన జట్లతో తలపడి సెమీస్‌కోసం పోటీపడనున్నాయి. గత 2023 ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారతజట్టు వర్షం కారణంగా ఫైనల్ రద్దు కావడంతో ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కు బంగారు పతకం దక్కింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళల జట్టు కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.







కామెంట్‌లు (0)