జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్, నిస్షిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంక బ్యాటర్లు 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.పిచ్‌పై బంతి టర్న్ ఎక్కువగా ఉండటంతో శ్రీలంక తొలి నుంచీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది.అభిషేక్ శర్మ(7),సంజు శాంసన్(7)త్వరగానే పెవిలియన్‌కు చేరారు.అయితే,వైభవ్ సూర్యవంశీ(38: 21బంతుల్లో6ఫోర్లు, 2సిక్స్‌లు)దూకుడుగా ఆడి భారత్‌ను వెనుకడుగు వేయనీయకుండా చేశాడు.శ్రేయస్(13)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు చూశాడు.కానీ,స్వల్ప వ్యవధిలో వారిద్దరూ పెవిలియన్‌కు చేరారు.అలాగే అక్షర్ పటేల్(8),తిలక్ వర్మ(2),దూబే(3)పెద్దగా ప్రభావం చూపించలేదు.ఓ వైపు వికెట్లు పడుతున్నా..మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ 80పరుగులు చేశాడు.దీంతో భారత్ మెరుగైన స్కోరును(169/7)సాధించగలిగింది.శ్రీలంక బౌలర్లలో తరిందు2,సహన్2..వనుజ,లసిత్,నువానిదు తలో వికెట్ తీశారు.
అంతకుముందు మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది.వర్షం కారణంగా మ్యాచ్‌ను13ఓవర్లకు కుదించారు.తొలుత బంగ్లా13ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి111పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో పాక్11.3ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి112పరుగులు చేసి విజయం సాధించింది.






కామెంట్‌లు (0)