తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ఆఫీసుకు 'ఐకాన్జా` అనే పేరు పెట్టినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ అర్జున్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య విగ్రహం ముందు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా కథలపై చర్చలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పన, భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు వంటి కార్యక్రమాలు ఈ కార్యాలయం నుంచే జరగనున్నట్లు సమాచారం.
'ఐకాన్జా`ను ప్రారంభించిన అర్జున్
2 గంటల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)