గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్ 12న 'గోట్`

1 గంట క్రితం

నవంబర్ 12న 'గోట్` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గోట్. దీనికి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. దర్శకుడు వేదవ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోంది. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడ‌క్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ‘వినోదం, భావోద్వేగాలు అండ్ పిచ్చి చేష్టలతో నిండిన ఉత్కంఠభరితమైన వెండితెర అనుభవానికి సిద్ధంగా ఉండండి.. థియేటర్లలో కలుద్దాం’ అంటూ ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్