గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​మహమూద్‌ ‌దెబ్బకు ఆసీస్‌ ‌కుదేల్‌

1 గంట క్రితం

ban vs aus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 198/10

డార్విన్‌(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో బంగ్లాదేశ్‌ ‌పేసర్‌ హసన్‌ ‌మహమూద్‌ ‌సంచలన స్పెల్‌‌తో చెలరేగాడు. కెరీర్‌ ‌బెస్ట్‌ ‌బౌలింగ్‌(6/55) మెరిసిన మహమూబ్‌కి తోడు తస్కిన్‌ అహ్మద్‌, హొసైన్‌ ‌రెండేసి వికెట్లతో రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌లో 198 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు హెడ్‌(22), వెథర్లాడ్‌(23) తొలి వికెట్‌‌కు 45 పరుగులు జతచేసిన తర్వాత ఆసీస్‌ ‌బ్యాటర్ల పతనం మొదలైంది. మిడిలార్డర్‌‌లో సీనియర్‌ ‌బ్యాటర్‌ ‌స్టీవ్‌ ‌స్మిత్‌(71) ‌మాత్రమే అర్ధసెంచరీతో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌‌లో కమిన్స్‌, లబూషేన్‌, స్టార్ట్క్‌, లియన్‌ సింగిల్‌ ‌డిజిట్‌‌కే పరిమితమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 53 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ‌జట్టు తొలిరోజు ఆట ముగిసేసరికి 24 ఓవర్లలో వికెట్‌ ‌నష్టానికి 96 పరుగులు చేసింది. షాద్మాన్(20) వికెట్‌‌ను మిఛెల్‌ ‌స్టార్క్‌ ‌పడగొట్టి టెస్టుల్లో అత్యధిక వికెట్లు(433) తీసిన తొలి బౌలర్‌‌గా రికార్డుల్లోకెక్కాడు. క్రీజ్‌‌లో తస్మిన్‌(32), మోమినుల్‌(35) ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్