కీలక పోరులో యుఎఇపై బంగ్లా మహిళల గెలుపు
దుబాయ్: మహిళల ఆసియాకప్ సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది. మంగళవారం జరిగిన గ్రూప్ లీగ్ చివరి పోరులో బంగ్లాదేశ్ జట్టు 34 పరుగుల తేడాతో ఆతిథ్య యుఎఇపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులకు ఆలౌటయ్యారు. ఛేదనలో భాగంగా యుఎఇ మహిళలు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 69 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షమీమ్ అక్తర్(38), కెప్టెన్ నిఘర్ సుల్తానా(23) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. యుఎఇ బౌలర్లు సురక్షకు మూడు, నందకుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రుబేయా ఖాన్(3/14), మరుఫా అక్తర్(2/9), నహిదా అక్తర్(2/18) కట్టుదిట్టంగా బౌల్ చేసి యుఎఇ బ్యాటర్లను కట్టడి చేశారు. 10న తొలి సెమీస్‌లో భారత్‌తో బంగ్లాదేశ్, 11న రెండో సెమీస్‌లో శ్రీలంకతో పాకిస్తాన్ మహిళలు తలపడనున్నారు.








కామెంట్‌లు (0)