ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబేథెల్‌ ధనా ధన్‌

18 గంటల క్రితం

england
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 06:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రెండో టి20లో టీమిండియాకు నిరాశ

  • ఇంగ్లండ్‌ ‌చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి

మాంచెస్టర్‌: రెండో టి20లో ఇంగ్లండ్‌ ‌జట్టు ఘన విజయం సాధించింది. ట్రాఫోర్డ్‌ ‌వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు విఫలమయ్యారు. టీమిండియా నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్‌ ‌జట్టు సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు సాల్ట్‌, బట్లర్‌ ‌డకౌట్లయినా.. బేథెల్‌ ధనా ధన్‌ ఇన్నింగ్స్‌‌తో మెరిసి మ్యాచ్‌‌ను ముగించాడు. కెప్టెన్‌ ‌బ్రూక్‌(39; 15బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), బాంటమ్‌(39) ‌సహకారంతో బేథెల్‌(76నాటౌట్‌; 46బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు) ‌మరింత రెచ్చిపోయి ఆడాడు. దీంతో ఇంగ్లండ్‌ ‌జట్టు 19 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లలో ఆర్ష్‌‌దీప్‌‌కు మూడు, హర్షిత్‌ ‌రాణా, అక్షర్‌, వరుణ్‌ ‌చక్రవర్తికి ఒక్కో వికెట్‌ లభించాయి. ఇక రవి బిష్ణోయ్‌ 4ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకొని టీమిండియా ఓటమికి కారకుడయ్యాడు. అంతకుముందు భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియాకు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (43) పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (49), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇషాన్ కిషన్ ఒక్క పరుగు తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక శివమ్ దూబే (5) విఫలమైనప్పటికీ, చివర్లో తిలక్ వర్మ (24 నాటౌట్) రెండు సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారతజట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యవంశీ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. వాటిలో ఆర్చర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. అయితే, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయిన సూర్య వంశీ స్టంపౌట్ అయ్యాడు.

స్కోర్‌‌బోర్డు...

ఇండియా ఇన్నింగ్స్‌: అభిషేక్‌ ‌శర్మ (సి)టామ్‌ ‌బాంటమ్‌ (‌బి)కర్రన్‌ 43, వైభవ్‌ ‌సూర్యవంశీ (స్టంప్‌)‌బట్లర్‌ (‌బి)విల్‌ ‌జాక్స్‌ 14, ఇషాన్‌ ‌కిషన్‌ (‌సి)డాసన్‌ (‌బి)కర్రన్‌ 48, శ్రేయస్‌ అయ్యర్‌ (‌సి)బాంటన్‌ (‌బి)డాసన్‌ 37, దూబే (సి)బాంటన్‌ (‌బి)కర్రన్‌ 5, తిలక్‌ ‌వర్మ (నాటౌట్‌) 24, అక్షర్‌ ‌పటేల్‌ (‌రనౌట్‌)‌బట్లర్‌ 2, హర్షిత్‌ ‌రాణా (సి)బట్లర్‌ (‌బి)ఆర్చర్‌ 6, అదనం 10 (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 190 పరుగులు.

వికెట్ల పతనం: 1/50, 2/65, 3/130, 4/146, 5/165, 6/165, 7/190

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-40-1, టంగ్‌ 4-0-46-0, విల్‌ ‌జాక్స్‌ 3-0-22-1, కర్రన్‌ 4-0-33-3, డాసన్‌ 3-0-27-1, రషీద్‌ 2-0-21-0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (‌సి)ఇషాన్‌ (‌బి)ఆర్ష్‌‌దీప్‌ 0, బట్లర్‌ (‌సి)వరుణ్‌ ‌చక్రవర్తి (‌బి)ఆర్ష్‌‌దీప్‌ 0, హ్యారీ బ్రూక్‌ (‌సి)ఇషాన్‌ (బి)అక్షర్‌ 39, బేథెల్‌ (‌నాటౌట్‌) 76, బాంటన్‌ (‌సి)తిలక్‌ ‌వర్మ (‌బి)ఆర్ష్‌‌దీప్‌ 39, విల్‌ ‌జాక్స్‌ (ఎల్‌‌బి)వరుణ్‌ ‌చక్రవర్తి 9, సామ్‌ ‌కర్రన్‌ (‌సి)సూర్యవంశీ (బి)హర్షిత్‌ ‌రాణా 7, జోఫ్రా ఆర్చర్‌ (‌నాటౌట్‌) 10, అదనం 11. (19 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 191 పరుగులు.

వికెట్ల పతనం: 0/1, 1/2, 3/51, 4/118, 5/133, 6/179

బౌలింగ్‌: ఆర్ష్‌‌దీప్‌ 4-0-40-3, హర్షిత్‌ ‌రాణా 3-0-30-1, బిష్ణోయ్‌ 4-0-60-0, అక్షర్‌ ‌పటేల్‌ 4-0-20-1, వరుణ్‌ ‌చక్రవర్తి 4-0-37-1.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్