- మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగింత
ముంబయి: ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా మరోసారి రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఈమేరకు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ పేరును శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. గత సీజన్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్(పిబికెఎస్) జట్టుకు ట్రేడ్ కావడంతో కెప్టెన్సీ ఖాళీ ఏర్పడింది. ఈ రేసులో భారత టి20 సారథి సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు సైతం వినిపించాయి. కానీ, రోహిత్ శర్మనే తిరిగి నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. దశాబ్దానికి పైగా ముంబయిని నడిపించిన రోహిత్, తన కెప్టెన్సీలో జట్టుకు 2013, 2015, 2017, 2019, 2020లలో ఏకంగా ఐదు ట్రోఫీలు అందించి ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. గత 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబయి అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలోనే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో నిలిచింది. 2024లో రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించడంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాబోయే సీజన్ కోసం కోచింగ్ సిబ్బందిని కూడా ముంబయి ప్రక్షాళన చేసింది. కీరన్ పొలార్డ్ (హెడ్ కోచ్), రాబిన్ ఉతప్ప (బ్యాటింగ్ కోచ్), మిచెల్ మెక్లీనగన్ (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్), ధావల్ కులకర్ణి (డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్) బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 16న గోవాలో జరిగే మినీ వేలానికి ముందే ఈ ప్రకటన వెలువడంతో ముంబయి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)