శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌కు త్రీసా, గాయత్రి

46 నిమిషాల క్రితం

das
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

​న్యూఢిల్లీ: సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి భారత మహిళల డబుల్‌ జంట త్రీసా జోలీ, గాయత్రి గోపీచంద్‌ జంట ప్రవేశించింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్లో భారత టాప్‌సీడ్‌ జంట 7వ ర్యాంకర్‌ ఫ్రాన్స్‌కు చెందిన మర్కాట్‌, కమిలినిలతో తలపడాల్సి ఉంది. కానీ ఫ్రాన్స్‌ జంట టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో భారతజంట మ్యాచ్‌ ఆడకుండానే సెమీస్‌కు చేరారు. శనివారం జరిగే సెమీస్‌లో త్రీసా-గాయత్రి జంట 3వ ర్యాంకర్‌, ఉక్రెయిన్‌కు చెందిన పోలిని-కంటేమియర్‌లతో తలపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి తాన్వీ శర్మ, ఉన్నతి హుడా ప్రవేశించారు. క్వార్టర్‌ఫైనల్లో 2వ ర్యాంకర్‌ తాన్వీ శర్మ 21-19, 18-21, 21-14తో ఇండోనేషియాకు చెందిన ప్రతివిని చిత్తుచేయగా.. మరో క్వార్టర్‌ఫైనల్లో 3వ ర్యాంకర్‌ ఉన్నతి హుడా 21-19, 15-21, 21-18తో భారత్‌కే చెందిన అన్మోల్‌ ఖర్బ్‌ను ఓడించింది. సెమీస్‌లో ఉన్నతి హుడాతో తాన్వీ శర్మ తలపడనున్నారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి సాత్విక్‌-రక్ష‍ిత ప్రవేశించారు. వీరు 21-8, 21-14తో భారత్‌కే చెందిన విజయ్‌-రుతుపర్ణ జంటను ఓడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్