శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వారెవ్వా.. ఓవర్టన్‌...

48 నిమిషాల క్రితం

sadf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడో టి20లో ఆసీస్‌పై ఇంగ్లాండ్‌ గెలుపు
బ్రిస్బేన్‌: ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20లో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 16.5ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. ఓవర్టన్‌(5/12)కి తోడు డాసన్‌(3/16) బౌలింగ్‌లో రాణించారు. ఆసీస్‌ టాపార్డర్‌ బ్యాటర్లు హార్పర్‌(26), మెక్‌గుర్ణ్‌(22), నిఖిల్‌ చౌదరి(19), మిఛెల్‌ ఓవెన్‌(17), కెప్టెన్‌ మార్ష్‌(11) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. అనంతరం ఇంగ్లాండ్‌ 8.5ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచింది. దీంతో డక్‌వర్త్‌లో ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. డొనాల్డ్‌(32), బాంటన్‌(10నాటౌట్‌), జోర్డాన్‌ కాక్స్‌(33; 14బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) బ్యాటింగ్‌లో రాణించారు. సాల్ట్(5), కెప్టెన్‌ బ్రూక్‌(9) నిరాశపరిచారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఓవర్టర్‌కు లభించింది. ఈ గెలుపుతో ఐదు టి20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 2-1 ఆధిక్యతలో ఉండగా.. నాల్గో టి20 సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్