చెంగ్డూ(చైనా): 2027 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు భారత ధ్వయం అర్జున్ ఖాడే-సిద్ధాంత్ భాటియా అర్హత సాధించారు. చెంగ్డూ వేదికగా శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2027 ఆసియా పసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే-ఆఫ్ డబుల్స్ ఫైనల్‌లో భారత ధ్వయం వరుససెట్లలో జపాన్ జంటను చిత్తుచేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జున్ ఖాడే-సిద్ధాంత్ భాటియా జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారులు కైటో ఉసుగి-టకెరు యుజుకిలను 7-6(7-4), 6-4 తేడాతో ఓడించారు. ఈ విజయంతో భారత జోడీకి మెయిన్ డ్రాలో వైల్డ్ కార్డ్ ఖరారయ్యింది. సిద్ధాంత్-అర్జున్ జంట తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అర్జున్-సిద్ధాంత్ అర్హత
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)