మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అభిషేక్ పోరెల్ అరెస్ట్

13 గంటల క్రితం

Cricketer Abhishek Porel arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌కతా: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన యువ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ లైంగిక దాడి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో పోలీసులు పోరెల్‌ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చించురా న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కీలక ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పోరెల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.

బాధితురాలి కథనం మేరకు 2023 జనవరి నుంచి అభిషేక్ పోరెల్‌తో పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, పోరెల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సదరు విద్యార్థిని ఆరోపించింది. తాము కలిసి విదేశాలకు సైతం వెళ్లామని ఆ ఫిర్యాదులో తెఆెలిపింది. ఆ తర్వాత తమ మధ్య విబేధాలు తలెత్తాయని, ప్రశ్నించిన తనపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్