గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND Vs ENG 2nd ODI : ఆదుకున్న కోహ్లి, శ్రేయస్‌

1 గంట క్రితం

kohli and sreyas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇండియా 233/ఆలౌట్‌

  • ఇంగ్లండ్‌‌తో రెండో వన్డే

కర్డీఫ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నామమాత్రపు స్కోర్‌‌కే పరిమితమైంది. సోఫ్లా గార్డెన్స్‌‌లో గురువారం టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ కోహ్లి (65), శ్రేయస్‌ అయ్యర్‌ (66) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్‌ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో 3వికెట్ల నష్టానికి 178 పరుగులతో పటిష్టంగా నిలిచి భారీ స్కోర్‌ చేసేలా కనిపించిన భారత్‌.. విరాట్‌ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ క్రీజ్‌లో కుదురుకొని ఆడుతున్నా.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 230 పరుగుల మార్కును చేరింది. అట్కిన్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ (26), శుభ్‌మన్‌ గిల్‌ (31) శుభారంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నా.. ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో అద్భుత అర్ద శతకాలతో రాణించిన వాషింగ్టన్‌ సుందర్‌ (2), అక్షర్‌ పటేల్‌ (1) కర్డీఫ్‌‌లో స్వల్పస్కోర్లకే పెవీలియన్‌‌కు చేరారు. విధ్వంసకర ఆటగాడు శివమ్‌ దూబే తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్‌ వరుస బంతుల్లో అక్షర్‌, దూబేలను ఔట్‌ చేశాడు. గుర్నూర్‌ బ్రార్‌ కూడా 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగ్గా.. ప్రసిద్ద్‌ కృష్ణ (0) డకౌటయ్యాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 233 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, అట్కిన్సన్‌కు మూడేసి వికెట్లు, సాకిబ్‌ మహమూద్‌కు రెండు, సామ్‌ కర్రన్‌, విల్‌ జాక్స్‌ చెరో వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

స్కోర్‌‌బోర్డు...

​ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ ‌శర్మ (సి)బట్లర్‌ (‌బి)విల్‌ ‌జాక్స్‌ 26, శుభ్‌‌మన్‌ (‌సి)డకెట్‌ (‌బి)అట్కిన్సన్‌ 31, విరాట్‌ ‌కోహ్లి (సి)ఆదిల్‌ ‌రషీద్‌ (‌బి)జోఫ్రా ఆర్చర్‌ 65, ఇషాన్‌ ‌కిషన్‌ (‌సి అండ్‌ ‌బి)సామ్‌ ‌కర్రన్‌ 1, శ్రేయస్‌ అయ్యర్‌ (‌సి)బట్లర్‌ ‌(బి)అట్కిన్సన్‌ 66, సుందర్‌ (‌సి)బట్లర్‌ (‌బి)మహమూద్‌ 2, అక్షర్‌ ‌పటేల్‌ (‌సి)బట్లర్‌ (‌బి)ఆర్చర్‌ 1, దూబే (సి అండ్‌ ‌బి)ఆర్చర్‌ 0, గుర్నూర్‌ ‌బ్రార్‌ (‌సి)అట్కిన్సన్‌ (‌బి)మహమూద్‌ 7, బుమ్రా (నాటౌట్‌) 20, ప్రసిధ్‌ ‌కృష్ణ (బి)అట్కిన్సన్‌ 0, అదనం 14. (44 ఓవర్లలో ఆలౌట్‌) 233 పరుగులు.

వికెట్ల పతనం: 1/44, 2/104, 3/111, 4/178, 5/181, 6/193, 7/193, 8/210, 9/233, 10/233. బౌలింగ్‌: ఆర్చర్‌ 10-0-43-2, మహమూద్‌ 9-1-52-2, అట్కిన్సన్‌ 9-1-50-3, ఆదిల్‌ ‌రషీద్‌ 5-0-34-0, సామ్‌ ‌కర్రన్‌ 6-1-23-1, విల్‌ ‌జాక్స్‌ 5-0-21-1.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్