రోహిత్ సెంచరీ, కోహ్లి, గిల్ అర్ధసెంచరీలు
చివరి వన్డేలో 20పరుగుల తేడాతో పరాజయం
వన్డే సిరీస్ విజేత ఇంగ్లాండ్
లండన్: లార్డ్స్ స్టేడియంలో పరుగుల వరద పారింది. భారత బౌలర్లే లక్ష్యంగా ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. భారీ ఛేదనలో టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(138), గిల్(77), కోహ్లి(74)కి తోడు చివర్లో ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ (0), కెఎల్ రాహుల్(0) డకౌట్ కాగా, అక్షర్ పటేల్(2) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. చివర్లో గుర్నూర్(18), ఆర్ష్‌దీప్(15) అజేయంగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కర్రన్‌కు నాలుగు, ఆర్చర్, ఆదిల్ రషీద్, బేథెల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును నెలకొల్పారు. జాకబ్ బెథెల్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత బెన్ డకెట్ అద్భుతంగా ఆడి 135 బంతుల్లోనే 141 పరుగులు చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్ కూడా అజేయంగా 74 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 14 పరుగులకే ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు రెండు, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ దక్కాయి. టీమిండియా పేస్ గుర్రం జస్పీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. టీమిండియా పేస్ గుర్రం జస్పీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం ఉన్నాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకొంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బేథెల్‌కు, సిరీస్ రూట్‌కు దక్కాయి.
స్కోర్‌బోర్డు...
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి అండ్ బి)ప్రిన్స్ యాదవ్ 141, బేధెల్ (సి)రోహిత్ (బి)ప్రసిధ్ కృష్ణ 91, రూట్ (నాటౌట్) 74, బ్రూక్ (సి)కోహ్లి (బి)ప్రసిద్ కృష్ణ 14, బట్లర్ (నాటౌట్) 41, అదనం 26. (50ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 387 వికెట్ల పతనం: 1/192, 2/293, 3/324
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 10-0-72-0, ప్రసిద్ కృష్ణ 10-2-69-2, ప్రిన్స్ యాదవ్ 10-0-79-1, గుర్నూర్ బ్రార్ 10-0-97-0, అక్షర్ పటేల్ 10-0-61-0.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి)బేథెల్ 138, గిల్ (ఎల్‌బి)ఆదిల్ రషీద్ 77, కోహ్లి (సి)బ్రూక్ (బి)సామ్ కర్రన్ 74, ఇషాన్ కిషన్ (సి)రెహాన్ అహ్మద్ (బి)సామ్ కర్రన్ 14, శ్రేయస్ అయ్యర్ (సి)రెహాన్ అహ్మద్ (బి)సామ్ కర్రన్ 0, కెఎల్ రాహుల్ (బి)ఆర్చర్ 0, అక్షర్ పటేల్ (సి)విల్ జాక్స్ (బి)సామ్ కర్రన్ 2, గుర్నూర్ బ్రార్ (నాటౌట్) 18, ఆర్ష్‌దీప్ (నాటౌట్) 15, అదనం 10. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 360 పరుగులు.
వికెట్ల పతనం: 1/147, 2/260, 3/304, 4/304, 5/315, 6/327, 7/329
బౌలింగ్: ఆర్చర్ 10-0-63-1, అట్కిన్సన్ 6-0-24-0, టంగ్ 5-1-43-0, కర్రన్ 10-0-75-4, రషీద్ 8-0-64-1, జాక్స్ 4-0-38-0, బేథెల్ 7-0-49-1.








కామెంట్‌లు (0)