సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐపిఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

1 గంట క్రితం

ipl 2026
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డిసెంబర్‌ 16న గోవాలో మినీ వేలం

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) 2027 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 16న గోవా వేదికగా 2027 ఐపిఎల్‌ సీజన్‌కు సంబంధించి మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా అందించాల్సి ఉంటుంది. ఇక జూన్‌లో రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), కుల్దీప్ యాదవ్ (లక్నో సూపర్‌ జెయింట్స్)ల మధ్య ట్రేడింగ్ జరగ్గా, ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇచ్చి, అన్‌క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీని సొంతం చేసుకుంది. వేలానికి వారం ముందు వరకు ఈ ట్రేడింగ్ విండో తెరిచే ఉంటుంది. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభ తేదీలను బిసిసిఐ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, మార్చి చివరి వారంలో టోర్నీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత మూడు సంవత్సరాల సైకిల్‌లో ఇది చివరి మినీ వేలం. 2028 సీజన్‌కు ముందు భారీ స్థాయిలో మెగా ఆక్షన్ జరగనుంది. ఆ మెగా వేలంతో పాటు కొత్త మీడియా హక్కుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2027లో ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అహ్మదాబాద్‌లో జరిగిన 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్సీబీ తన టైటిల్‌ను నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే డిసెంబర్ మినీ వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేసి, ఐపీఎల్ 2027 సీజన్‌లోనూ హ్యాట్రిక్ టైటిల్ సాధించాలని ఆర్సీబీ భావిస్తోంది. నవంబర్ 15 లోపు తమ ప్లాన్‌లను సిద్ధం చేసుకునే పనిలో మిగతా ఫ్రాంచైజీలు నిమగ్నమయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్