సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలూలా జయభేరి..

1 గంట క్రితం

FFF--lula old age.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బ్రెజిల్‌ అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నిక

  • ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాభాగస్వామ్యాన్ని పెంచుతానని వెల్లడి

  • లాటిన్‌ అమెరికాలో మితవాదానికి ఎదురుదెబ్బ

​బ్రెజిల్‌ ‌ప్రజానీకం కొత్త చరిత్ర సృష్టించారు. తమ దేశంపై పెత్తనం చేయడానికి సామ్రాజ్యవాదం పన్నిన కుట్రలను, కార్పొరేట్ల కట్టు కథలను తిరస్కరించారు. వారికి అండగా నిలిచి బ్రెజిల్‌‌ను దోపిడి శక్తుల పెరటి తోటగా మార్చడానికి అనునిత్యం ప్రయత్నించిన మితవాద శక్తులను తోసిపుచ్చారు. బ్రెజిల్‌ ప్రజల స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి, అభివృద్ధికి ప్రతిన చేసిన వామపక్ష నేత లూలా వైపు నిలిచారు. సోమవారం నాడు వెలువడిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో లూలా జయభేరి మోగించారు! బ్రెజిల్‌ ‌చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ రానన్ని ఓట్లు లూలాకు దక్కాయి. కార్పొరేట్, సామ్రాజ్యవాద, మితవాద రాజకీయాలపై అక్కడి ప్రజలు చేసిన తిరుగుబాటుకు, వామపక్షం తప్ప మరేది భవితకు భరోసా ఇవ్వదన్న వాస్తవానికి లూలా విజయం ఒక నిదర్శనం. ఈ ఎన్నికల్లో లూలాకు 51.76శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి ప్లావియో బొల్సోనరా 48.24 శాతం ఓట్లు సాధించారు. ఆయన ఓటమే లక్ష్యంగా అమెరికా ఈ ఎన్నికలలో ఎన్నో కుట్రలకు దిగింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌లూలాకు వ్యతిరేకంగా విషంకక్కారు. అయినా, బ్రెజిల్‌ ప్రజానీకం యావత్తు లూలా వెంట నిలిచింది! యువత స్వచ్ఛందంగా కదలింది. ‘లూలా సైన్యం’ పేరుతో సోషల్‌ ‌మీడియాలో బ్రెజిల్‌ ‌పరిరక్షణకు కదం తొక్కి కొత్త భవిష్యత్తును ఆవిష్కరించింది. బ్రెజిల్‌ ప్రజలు అందించిన ఈ విజయం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాదు. లాటిన్‌ అమెరికాలో మితవాద శక్తులకు ఈ విజయం గట్టి ఎదురుదెబ్బ!సమానత్వం, సోషలిజం, సామాజిక న్యాయం, కార్మికుల హక్కులు, పేదల సంక్షేమం కోసం పోరాడుతున్న ప్రపంచవ్యాప్త వామపక్ష శ్రేణులకు ఈ విజయం కొత్త ఆశల పతాకం! పోరాట పథంలో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చే విజయ నాదం!

ప్రజాస్వామ్య విజయం : సిపిఎం

లూలా విజయాన్ని సిపిఎం స్వాగతించింది. ఈ మేరకు సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో ‘ట్రంప్ మద్దతున్న ఫ్లావియో బోల్సనారో విభజనవాద, తీవ్రవాద విధానాలను బ్రెజిల్‌ ‌ప్రజలు తిరస్కరించారని తెలిపింది. ఇది ప్రజాస్వామ్య విజయమని, మితవాద ‌రాజకీయాలకు పతనం తప్పదనడానికి ఈ గెలుపు నిదర్శనం’ అని వ్యాఖ్యానించింది. లూలా నాలుగో పర్యాయం గెలవడం చారిత్రాత్మకమని సిపిఎం పేర్కొంది.

సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్