నేడు న్యూజిలాండ్‌తో మూడో టి20
మధ్యాహ్నం 12.30గం.ల నుంచి
వెల్లింగ్టన్: తొలి రెండు టి20లలో సంచలన విజయాలతో అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా.. ఇక సిరీస్‌పై గురిపెట్టింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. వెల్లింగ్టన్‌లో జరిగే మూడో టి20లో గెలిస్తే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా రెండో టి20కి దూరం కాగా.. అతడు మూడో మ్యాచ్ నాటికి అందుబాటులోకి రావడం కష్టమే. దీంతో మిగతా ఆటగాళ్లతో విజయాన్ని అందుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక మూడో టి20 జరిగే వెల్లింగ్టన్ మైదానం పేసర్లకు స్వర్గధామం. గత రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన హాగ్లే ఓవల్ మైదానం చాలా పెద్దది. మూడు రోజుల వ్యవధిలోనే అక్కడ రెండు మ్యాచ్‌లు జరిగాయి. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు కొంత అనుకూలించే ఛాన్స్ ఉంది. దీంతో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి చోటు దక్కడం ఖాయం. సోమవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దూబే, నితీష్ కుమార్చ నమన్ ధీర్ నెట్స్‌లో తమ బ్యాటింగ్ నైపుణ్యాలకు పదును పెట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో చెమటోడ్చగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
కివీస్ జట్టులో మూడు మార్పులు..
తొలి రెండు టి20ల్లో ఓటమిపాలైన కివీస్ జట్టులో మార్పులు మార్పులకు తెరలేపింది. స్టార్ పేసర్ లాకీ ఫెర్గుసన్ స్థానంలో కైల్ జేమీసన్ జట్టుతో కలిసాడు. బ్లేయర్ టిక్నర్, యువ ఆటగాడు జోష్ క్లార్క్సన్‌ను జట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబర్ట్ వాల్టర్ వెల్లడించారు.
జట్లు(అంచనా)..
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), షెఫర్ట్ (వికెట్ కీపర్), స్మిత్, అలెన్, మిఛెల్, ఫిలిప్స్, జాకోబ్స్, బ్రాస్‌వెల్, జేమీసన్, వాల్టర్/టిక్నర్, కార్ల్‌సన్/డఫీ.







కామెంట్‌లు (0)