న్యూజిలాండ్ 356/10 ఇండియా 116/6
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఫాలోఆన్ గండం కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ బ్యాటర్లు మరో 41 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లే ఉండటం, అందులోనూ న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడంతో ఆ పరుగులు రాబట్టడం కష్టమే. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసింది. ఈ స్కోరుకు భారత్ ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కినా, ఈ టెస్ట్‌లో టీమిండియా పుంజుకోవాలంటే మూడోరోజు ఆట కీలకంగా మారింది. ఓవర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 110 పరుగులు జటచేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు, సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో రెండో రోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 356 పరుగుల వద్ద ముగిసింది. టామ్ బ్లండెల్ అత్యధికంగా 89 పరుగులు, టామ్ లాథమ్ 59 పరుగులతో రాణించారు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 31 పరుగులు చేశాడు. హెన్రీ నికోల్స్ 16 పరుగులకే పరిమితమయ్యాడు. డారిల్ మిచెల్ 31 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులు సాధించారు. నాథన్ స్మిత్ 26 పరుగులు చేయగా, జేమీసన్ 19, మ్యాట్ హెన్రీ 19 పరుగులు చేశారు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పడిక్కల్(21) జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ (1/29), జేమీసన్ (2/33), డఫీ (2/21), నాథన్ స్మిత్ (1/29) నిప్పులు చెరగడంతో భారత్ 46 ఓవర్లలో 116 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 25, పడిక్కల్ 21, గిల్ 17, పంత్ 23, సుందర్ 10 పరుగులు చేశారు. జురెల్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కూడా కైవసం చేసుకుంటుంది. న్యూజిలాండ్ బౌలర్స్‌లో హెన్రీ, జెమీసన్ తలా ఒక్క వికెట్ తీసుకున్నారు.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 356పరుగులు
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి)హెన్రీ 0, కెఎల్ రాహుల్ (సి)కాన్వే (బి)డఫీ 25, పడిక్కల్ (సి)బ్లండెల్ (బి)జేమీసన్ 21, గిల్ (సి)లాథమ్ (బి)జేమీసన్ 17, పంత్ (సి)జేమీసన్ (బి)డఫీ 23, సుందర్ (సి)లాథమ్ (బి)స్మిత్ 10, ధృవ్ జురెల్ (బ్యాటింగ్) 7, అదనం 13. (46ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 116 పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/33, 3/59, 4/98, 5/104, 6/116 బౌలింగ్: హెన్రీ 13-4-29-1, జేమీసన్ 13-4-33-2, స్మిత్ 12-3-29-1, డఫీ 8-3-21-2.








కామెంట్‌లు (0)