నేడు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక పోరు
మధ్యాహ్నం 2.00గం.ల నుంచి
గౌహతి: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్ గెలుపుపై దృష్టి సారించింది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం బుధవారం జరిగే కీలక పోరులో వెస్టిండీస్‌ను టీమిండియా ఓడిస్తే మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీలతో రాణించారు. దీంతో విండీస్‌పై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. మరోవైపు గౌహతి స్టేడియం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ టీమిండియా గెలిచింది. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు భారీస్కోర్ నమోదు చేయడం ఖాయం. తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితమయ్యారు. దీంతో వీరంతా రెండో వన్డేలో చోటు కోసం వేచిచూస్తున్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టుతో లేని కారణంగా.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు నమన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో ఛేదన కొంత కష్టం. లైట్ల వెలుగులో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అలాగే అక్కడ మంచు ఎక్కువగా కురిసే అవకాశముంది. దీంతో టీమిండియా నలుగురు బౌలర్లతో రంగంలోకి దిగడం ఖాయం.







కామెంట్‌లు (0)