రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన భారత్
240 పరుగుల వెనుకంజలో టీమ్‌ఇండియా
క్రీజులో ధ్రువ్ జురెల్ (7 నాటౌట్)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 356 పరుగులతో పోలిస్తే భారత్ ఇంకా 240 పరుగుల వెనుకంజలో ఉంది. ధ్రువ్ జురెల్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
రెండో రోజు ఆట ముగింపునకు కొద్దిసేపటి ముందు భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. నాథన్ స్మిత్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ (10) స్లిప్‌లో టామ్ లేథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 116 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది.
భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ 25, రిషభ్ పంత్ 23, దేవదత్ పడిక్కల్ 21, శుభ్‌మన్ గిల్ 17 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు.








కామెంట్‌లు (0)