మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND VS NZ ODI : కోహ్లి, రోహిత్‌పైనే అందరి దృష్టి

1 గంట క్రితం

IND vs NZ ODI: All eyes on Kohli and Rohit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 06:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రేపటినుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం

ఆక్లాండ్‌: టి20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. తొలి మూడు టి20ను సంచలన విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ తర్వాత జరిగిన రెండో టి20ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో ఆ సిరీస్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ ఉంది. మరోవైపు చివరి రెండు టి20ల తరహాలోనే సమిష్టి ప్రదర్శనతో వన్డేల్లో శుభారంభం చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఇక భారత సీనియర్‌ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీతో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరగనున్నాయి. అలాగే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలో ఆటగాళ్లు మారనున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌‌కు తిరుగుండదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు మోయనున్నాడు. ఆ నలుగురిలో ఏ ఇద్దరు క్రీజ్‌లో కుదురుకున్నా.. భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం. అలాగే నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్లుగా బాధ్యతలు మోయాల్సిన సమయం ఆసన్నమైంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తే.. కుల్దీప్ యాదవ్‌కు చోటు ఖాయం. అక్షర్ పటేల్‌‌కు అవకాశం దక్కుతుంది. అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేలవ ఫామ్‌ నేపథ్యంలో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. మరోవైపు చివరి రెండు టి20ల్లో గెలిచిన ఉత్సాహంతో న్యూజిలాండ్‌ జట్టు ఈ సిరీస్‌కు సిద్ధమౌతోంది. చివరి టి20 జరిన ఆక్లాండ్‌లోనే తొలి వన్డే జరగనున్న క్రమంలో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా న్యూజిలాండ్‌ బరిలోకి దిగుతోంది.

షెడ్యూల్‌...

04(బుధ) : తొలి వన్డే (ఆక్లాండ్‌, ఈడెన్‌పార్క్‌)

07(శని) : రెండో వన్డే (వెల్లింగ్టన్‌, హెన్రీ స్టేడియం)

10(మంగళ): మూడో వన్డే (హామిల్టన్‌, సెడాన్‌ పార్క్‌)

13(శుక్ర): నాలుగో వన్డే (మౌంట్‌ మౌంగనూయ్‌, బే ఓవల్‌)

15(ఆది) : ఐదో వన్డే (మౌంట్‌ మౌగనూయ్‌, బే ఓవల్‌)

(సమయం: ఉదయం 7.30గం.ల నుంచి)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్