మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

2 గంటల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 06:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-భీమవరం : మురసు తుఫాను మరియు భారీ వర్షాలు ప్రభావం దృష్ట్యా, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు.

ఈరోజు (3.11.2026, మంగళవారం) పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు.


మార్కాపురం జిల్లా లోని విద్యాసంస్థలకు నేడు సెలవు: కలెక్టర్ విజయ సునీత

మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు నేడు, సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు.


ఏలూరు జిల్లా: జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలలను పరిశీలించి, విద్యుత్ సరఫరా సమస్య, భారీ వర్షాలకు పాఠశాల భవనాలు స్థితిని పరిశీలించి నివేదికలు అందించాలని కలెక్టర్ డీఈఓ ని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్