శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND-vs-ZIM : సిరీస్‌‌పై టీమిండియా గురి

1 గంట క్రితం

IND-vs-ZIM-1st-T20-Highlights
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు జింబాబ్వేతో రెండో టి20

  • సా.4.30గం.ల నుంచి

హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్‌‌పై గురిపెట్టింది. హరారే వేదికగా శనివారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే.. మరో మ్యాచ్‌ ‌మిగిలి ఉండగానే సిరీస్‌‌ను కైవసం చేసుకోనుంది. మరోవైపు రెండో టి20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో జింబాబ్వే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరారే వేదికగా బుధవారం జరిగిన తొలి టి20లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ 18బంతుల్లోనే అర్ధసెంచరీ బాది టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండో టి20లో అతడికి చోటు ఖాయం. కానీ అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అశోక్ శర్మను తప్పించి మరో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు స్థానం దక్కవచ్చు. సిరీస్‌ గెలుపే థ్యేయంగా బరిలోకి దిగుతున్న క్రమంలో టీమిండియా జట్టులో పెద్ద మార్పులు లేకపోవచ్చు. అదే జరిగితే సుయాన్ష్ షెడ్జే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్ష్ దూబేలకు నిరాశ తప్పదు. అభిషేక్ శర్మ మాత్రం తొలి టీ20లో విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించారు. అలాగే తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లోయరార్డర్‌లో ఆడనున్నారు. మయాంక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా ప్రిన్స్ యాదవ్ కూడా సత్తా చాటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ కు చోటు దక్కడం ఖాయం. మూడో, చివరి టి20 ఆదివారం ఇదే మైదానంలో జరగనుంది.

జట్లు(అంచనా)...

భారత్‌: ​శ్రేయస్ (కెప్టెన్‌), సూర్యవంశీ, అభిషేక్, ఇషాన్(వికెట్‌ ‌కీపర్‌), తిలక్ వర్మ, దూబే, రింకూ, బిష్ణోయ్, ప్రిన్స్, మయాంక్, అశోక్ .

జింబాబ్వే: సికిందర్‌ (కెప్టెన్‌), బెన్నెట్‌, బెన్‌ ‌కర్రన్‌, మయర్స్‌, రియాన్‌ ‌బురి, మధవెరా, మరుమణి(వికెట్‌ ‌కీపర్‌), ఎవాన్స్‌, న్యంబూరి, నరవా, ముజరబ్బాని.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్