శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

U-19: టైటిల్‌ కొట్టేదెవరో..?

13 నవంబర్, 2026

ind - pak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేడు అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాక్‌ ఢీ

- ఉదయం 10.30గం.ల నుంచి

మస్కట్‌: అండర్‌-19 ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఒమన్‌లోని అల్ అమెరాత్‌ స్టేడియంలో తలపడనున్నాయి. తొలి సెమీస్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై, పాకిస్తాన్‌ జట్టు 9వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. లీగ్‌ దశలో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు గ్రూప్‌-ఎలో ముఖాముఖి తలపడగా.. పాకిస్తాన్‌ జట్టు 3 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచేసింది. దీంతో ఫైనల్లో మరోసారి ఈ రెండు జట్ల మధ్య టైటిల్‌ పోరు జరగడంతో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్‌ దశ ప్రారంభ మ్యాచ్‌లో భారత యువ జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి శుభారంభం చేసింది. కానీ రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కానీ నిర్ణయాత్మక మూడో, చివరి లీగ్‌ మ్యాచ్‌లో యుఎఇపై 70పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్‌లో 2వ స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక పాకిస్తాన్‌ జట్టు గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో ఘన విజయాలను నమోదు చేసుకుంది. తొలి లీగ్‌ మ్యాచ్‌లో యుఎఇపై 9వికెట్ల తేడాతో, భారత్‌పై 3 వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి దుర్భేద్యఫామ్‌లో ఉంది. ఈ క్రమంలో టీమిండియా జట్టు పాకిస్తాన్‌ను ఓడించాలంటే అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్