బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2nd ODI : విండీస్‌ 405/7తో రికార్డు స్కోరు

1 గంట క్రితం

wi vs ind.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 07:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • క్యాంప్‌బెల్‌, హోప్‌, జంగూ సెంచరీలు

  • కుల్దీప్‌, జడేజా, బ్రార్‌కు రెండేసి వికెట్లు

 గువాహటి వేదికగా రెండో వన్డేలో వెస్టిండీస్‌ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలకు గాను ఏడు వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. క్యాంప్ బెల్(101), హోప్(104), జాన్ గో(114) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖరు ఓవర్ల లో చేజ్(29), జోసెఫ్(14) పరుగులతో రాణించారు. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. తొలిసారి 400 పరుగుల మార్కును దాటింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండిస్‌ బ్యాట్స్‌మెన్‌ క్యాంప్‌బెల్‌ మొదటి నుంచే దూకుడుగా ఆడాడు. 68 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. పవర్‌ప్లే ముగిసేసరికి విండీస్‌ 96/1తో నిలిచింది. క్యాంప్‌బెల్‌ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అయితే 101 పరుగుల వద్ద గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. హోప్‌కు రెండు క్యాచ్‌లు చేజారడం కలిసొచ్చింది. 15, 27 పరుగుల వద్ద భారత ఫీల్డర్లు అవకాశాలు వదిలేశారు. ఆ తర్వాత హోప్‌ చెలరేగాడు. 94 బంతుల్లో 104 పరుగులు చేశాడు. జంగూ కూడా వేగంగా బ్యాట్‌ ఝళిపించాడు. 77 బంతుల్లో 114 పరుగులు సాధించాడు. దీంతో ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేసిన జట్టు జాబితాలో విండీస్‌ చేరింది. క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది ఆరోసారి. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, గుర్నూర్‌ బ్రార్‌ రెండేసి వికెట్లు తీశారు. ప్రసిద్ధ్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్