ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లోనే విభేదాలు వెలుగుచూశాయి.
అభ్యంతరాలు 14
గత పది నెలల్లో కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలపై ఇద్దరు కమిషనర్లు కనీసం 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు రికార్డులు వెల్లడించాయి.
ఒకే రోజున 4 అభ్యంతరాలు
ఒకే రోజున నాలుగు అభ్యంతరాలు నమోదు చేసిన సందర్భం కూడా ఉందని కథనం తెలిపింది.
ఎస్‌ఐఆర్ విస్తరణ
బీహార్‌లో 2025 జూన్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌ను తరువాత 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించారు.
13 కోట్లకు పైగా పేర్ల తొలగింపు
ఈ ప్రక్రియలో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
ప్రధాన అభ్యంతరాల అంశాలు
• కొత్త ఓటర్ల నమోదు, ఫారం 6
• ఎన్నికల సాఫ్ట్‌వేర్, యాక్సెస్
• ఓటర్ల పేర్ల తొలగింపు, పునరుద్ధరణ
• పశ్చిమ బెంగాల్‌లోఅప్పీళ్ల దాఖలు
• ఓటర్ల డేటాబేస్ నిర్వహణ
•కమిషన్ పేరుతో* జారీ అయ్యే అధికారిక సమాచారం
ఫారం 6లో మార్పుఐ అభ్యంతరం
• కొత్త ఓటరు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గత ఎస్‌ఐఆర్ జాబితాలో ఉన్నాయా అనే ప్రశ్నను చేర్చారు.
• నిబంధనలు మార్చకుండా ఈ మార్పు చేయకూడదని వివేక్ జోషి ఫైల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
• సుఖ్‌బీర్ సింగ్ సంధు కూడా ఈ మార్పులపై*ఏకీ భవించలేదు. ఈ మార్పును "అనధికారికం, చట్టవిరుద్ధం"గా పేర్ల క్లియరెన్స్‌ను తిరస్కరించాలని ఆగస్టు 13న సంధు సూచించారు.
ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణపై ప్రశ్నలు
• ఓటర్ల డేటాబేస్ క్రమంగా ఢిల్లీ కేంద్రంగా కేంద్రీకృతమవుతుందని వివేక్ జోషి ప్రశ్నించారు.
• రాష్ట్రస్థాయి అధికారులకు ERONetలో పూర్తి యాక్సెస్ లేదని సంధు రికార్డుల్లో పేర్కొన్నారు.
• ఐటి విభాగానికి రాష్ట్ర అధికారుల యాక్సెస్‌ను పరిమితం చేసే అధికారముందా అని వివరాలు కోరారు.
పశ్చిమ బెంగాల్ అప్పీళ్లపై ప్రశ్నలు
• 60 లక్షల మంది ఓటర్ల అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు అప్పగించింది.
• 27 లక్షల పేర్లు తొలగించారు.
• 38 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
• 22.21 లక్షల అప్పీళ్లు - తొలగించిన పేర్లు తిరిగి చేర్చాలని అభ్యర్థనలు.
• 16.10 లక్షల అప్పీళ్లు - చేర్చిన పేర్లు తొలగించాలని అభ్యర్థనలు.
• ఈ 16.10 లక్షల అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారో వివరాలు కోరారు.
గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారం
• పరిశీలనలో 97 మంది అర్హులని గుర్తింపు.
• సాఫ్ట్‌వేర్‌లో రోల్‌బ్యాక్ సదుపాయం లేక పేర్లు జాబితాలో చేరలేదు.
• ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య ఎనిమిది సార్లు లేఖలు రాసినా స్పందన లేదని కథనం తెలిపింది.
కమిషన్ పేరుతో ఆదేశాలపై అభ్యంతరం
• ఏప్రిల్ 16న కమిషన్ పేరుతో వెలువడే కమ్యూనికేషన్లకు పూర్తి కమిషన్ ఆమోదం లేదని సంధు పేర్కొన్నారు.
• ఎనిమిది రోజుల తర్వాత వివేక్ జోషి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
క్యాబినెట్ కార్యదర్శికి లేఖలు
• ఐటి వ్యవస్థలో బాధ్యతల విభజనలో మార్పులు తమకు తెలియకుండా జరిగాయని చెప్తూ ఇద్దరు కమిషనర్లు విడివిడిగా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖలు రాశారు.
నాలుగు నెలల తర్వాత ముగ్గురి సమావేశం
• సెప్టెంబరు 9న జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశమయ్యారు. నాలుగు నెలల విరామం తర్వాత
ముగ్గురు కలిసి నిర్వహించిన పూర్తి స్థాయి సమావేశం ఇదే.
2023 చట్టం ఏమి చెబుతోంది
• చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 18 ప్రకారం కమిషన్ వ్యవహారాలు సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగా నిర్వహించాలి. అభిప్రాయభేదం ఉంటే మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు.
ఇసి వివరణ
• గత ఏడాది కాలంలో* తీసుకున్న అన్ని నిర్ణయాలు పూర్తి కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలేనని ఇసి స్పష్టం చేసింది. అంతర్గత చర్చలు, అభిప్రాయాలు ఏ సంస్థలోనైనా సాధారణ నిర్ణయ ప్రక్రియలో భాగమేనని తెలిపింది.








కామెంట్‌లు (0)