ప్రజాశక్తి-సీతానగరం
కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు అక్టోబర్ 5న రాజానగరంలో ‘అడుగు’ నినాదంతో చేపట్టే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసిపి నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం వైసిపి నాయకుడు డాక్టర్ బాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త పింఛన్లు, ఇళ్లు, మూడు సెంట్ల ఇంటి స్థలం, ఆడబిడ్డ నిధి రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3,000, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే ‘అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. యూరియా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇండోర్ స్టేడియం నిర్మించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సామాన్యులపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. సమావేశంలో కరుటూరి హరిబాబు, చళ్ళమళ్ళ సుజీరాజు, డాక్టర్ బాబు, గుర్రాల జ్యోత్స్న, రాజా, కోండ్రపు ముత్యాలు, పిచుకులు విజయ్, గద్దె బాబి, అంబటి రాజు, చెకూరినాని, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డాక్టర్ బాబు







కామెంట్‌లు (0)