బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ధర్మన్‌’ షూటింగ్‌కి ఆటోలో వచ్చిన రజనీకాంత్‌

1 గంట క్రితం

‘ధర్మన్‌’ షూటింగ్‌కి ఆటోలో వచ్చిన రజనీకాంత్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 07:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు రజనీకాంత్, హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నాలు నటిస్తోన్న తాజా చిత్రం 'ధర్మన్`. ఇందులో రజనీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన మరోసారి రిపీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మైసూర్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కి రజనీ కారులో కాకుండా ఆటోలో వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆటో దిగిన వెంటనే ఆయన తన అభిమానులకు అభివాదం చేస్తూ సెట్స్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాను దర్శకుడు అశ్వత్ మారిముత్త తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్