బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెజాన్ నౌ, ఆల్ట్రా సేవలు ఆవిష్కరణ

51 నిమిషాల క్రితం

అమెజాన్ నౌ, ఆల్ట్రా సేవలు ఆవిష్కరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం :

విశాఖ నగరంలో అమెజాన్ డెలివరీ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. కిరాణా సామగ్రి, ఫ్యాషన్ సౌందర్య వస్తువులు, గృహ, వంటగది సంబంధిత సామాగ్రి తదితర వేలాది ఉత్పత్తులను నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేసే ఆల్ట్రా డెలివరీ అమెజాన్ నౌ విధానం బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అమెజాన్ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా ఎవ్రీ డే ఎసన్షియల్ విభాగం డైరక్టర్ శ్రీకాంత్ శ్రీరాం మాట్లాడుతూ, విశాఖ నగరంలో అత్యంత ఆదరణ కలిగిన పండ్లు, కూరగాయలు, పాలు, ప్రీమియం వంట నూనెలు, నెయ్యి, చాక్లెట్లు, బ్రెడ్, నట్స్ తదితరాలను నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.


అక్టోబర్ 8 నుండి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులకు అమెజాన్ నౌ అద్భుతమైన, ఆకర్షణీయమైన అనేక ఆఫర్లు అందిస్తుందని, డ్రై ఫ్రూట్స్, నట్స్‌కు డిమాండ్ 60 శాతం పెరిగిందని చెప్పారు. బాదంపప్పు ప్రస్తుతం ప్రతి పది ఆర్డర్లలో ఒక ఆర్డర్‌లో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయని చెప్పారు. సెనగపిండి, రవ్వ, సేమియా స్వీట్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలకు 40 శాతం, పూజా సామగ్రి 35 శాతం, చాక్లెట్లు, స్వీట్లు, గిఫ్ట్ ప్యాక్‌లకు 30 శాతం చొప్పున డిమాండ్ పెరిగిందన్నారు. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో బెల్లం, సుగర్ ఫ్రీ స్వీటెనర్లు, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్-వీట్ బ్రెడ్‌లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. రైస్ బ్రైన్ ఆయిల్ విశాఖపట్నంలో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. అమెజాన్ నౌను విశాఖపట్నంలో ప్రవేశపెట్టటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్