సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIndia vs West Indies T20I: ఫామ్‌లో టీమిండియా

2 గంటల క్రితం

team india.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు వెస్టిండీస్‌తో తొలి టి20

  • రా.7.00గం.ల నుంచి

లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా ఇక టి20లపై దృష్టి సారించింది. ఈ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటతీరుకు మారుపేరైన వెస్టిండీస్‌పై సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా చెమటోడ్చాల్సిందే. విండీస్‌ తరఫున వన్డే సిరీస్‌లో ఆడని హెట్‌మైర్‌ జట్టుతో కలిసాడు. భారత పిచ్‌లపై అతడికి ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. హెట్‌మైర్‌తోపాటు హోప్‌, ఛేజ్‌, జంగూ, కీమో పాల్‌, పావెల్‌, షెఫర్డ్‌ ఫామ్‌లో ఉండడం శుభ పరిణామం. మరోవైపు టీమిండియా.. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఉత్సాహంతో నేరుగా విండీస్‌తో సమరానికి సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌ జరగనుండగా.. తొలి టీ20కి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను కొనసాగించనున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపాడు. దీంతో అతడికి తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్‌ లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ వైభవ్ మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం బిసిసిఐ ప్రకటించిన జట్టులో తొలుత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కినా.. ఆ తర్వాత అతని స్థానంలో నమన్ ధీర్ కు అవకాశం కల్పించారు. న్యూజిలాండ్‌, రంజీ ట్రోఫీ సీజన్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుండటంతో వాషింగ్టన్ సుందర్ రాష్ట్ర జట్టుకు రెడ్-బాల్ క్రికెట్ ఆడుతూ టెస్ట్ సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో వాషింగ్టన్ సుందర్ తన రాష్ట్ర జట్టుకు రెడ్-బాల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే లక్నోకు చేరుకున్న ఇరు జట్లు సోమవారం ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.

మూడో వన్డే విజయంతో విండీస్‌..

ముల్లాన్‌పూర్‌లో టీమిండియా నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్‌ సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ ఆఖరి పోరులో ఓడిపోవడంతో కనీసం ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. గ్రౌండ్‌లో జరిగిన ఈ ఓటమికి తోడు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంతో భారత్, వెస్టిండీస్ జట్లకు కఠిన జరిమానా విధించింది. మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయనందుకు గాను భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్‌కు 10 శాతం జరిమానా వేటు పడింది. నిర్ణీత సమయం కంటే టీమిండియా 4 ఓవర్లు వెనకబడిపోగా, వెస్టిండీస్ జట్టు 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. సమయానికి సంబంధించిన కొన్ని సడలింపులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, రెండు జట్లు కనీస ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలింది.

జట్లు(అంచనా)...

ఇండియా: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అక్ష‍ర్‌ పటేల్‌, కుల్దీప్‌, ఇషాన్‌ కిషన్‌, దూబే, అభిషేక్‌, ఆర్ష్ దీప్‌, తిలక్‌ వర్మ, బిష్ణోయ్‌, నితీశ్‌కుమార్‌/నమన్‌ ధీర్‌.

వెస్టిండీస్‌: హోప్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హొసైన్‌, ఛేజ్‌, మోతీ, హెట్‌మైర్‌, అర్‌ జంగూ, కీమో పాల్‌, స్రింగర్‌, పావెల్‌, షెఫర్డ్‌, రూథర్‌ఫర్డ్‌/పోర్ట్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్