సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలైంగికంగా వేధించిన ఎసిపికి ప్రమోషన్‌

2 గంటల క్రితం

dcp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ​బాధిత మహిళా జర్నలిస్టుకు నిర్బంధం

న్యూఢిల్లీ: మహిళలను ఉద్దరిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న బిజెపి ప్రభుత్వం మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఢిల్లీ ఎసిపి వివేక్‌ భగత్‌కు డిసిపిగా ఉద్యోగోన్నతి కల్పించింది. సిఇసి జ్ఙానేష్‌ ‌కుమార్‌‌ను తొలగిం చాలని జంతర్ మంతర్‌ ‌వద్ద ఆందోళనలను ప్రసారం చేస్తున్న మహిళా జర్నలిస్టును భగత్‌ మూడు రోజుల క్రితమే ‌లైంగికంగా వేధించారు. దీంతో ఆమె ప్రజాసంఘాలు, సిజెపి మద్ధతుతో పార్లమెంట్‌ ‌స్ర్టీట్‌ ‌పోలీసుల స్టేషన్‌ ‌వద్ద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు. వీడియోలు లేకపోతే కేసు నమోదు చేయబోమని ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధితురాలితోసహా 16 మందిని ఆదివారం అదుపులోకి తీసుకున్నా రు. తాజాగా భగత్‌కు డిసిపిగా బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రమోషన్ కల్పించింది. ఈ నిర్ణయాన్ని సిపిఎం, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) తీవ్రంగా తప్పుబట్టాయి. ‘‘వేధింపుల ఆరోపణ తర్వాత ప్రమోషన్ వచ్చే వ్యవస్థలో మనం జీవిస్తున్నామా?’’ అని సిజెపి ప్రశ్నిం చింది. కేంద్ర హోంశాఖ తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ‘ఇది మహిళా జర్నలిస్టులకు ఎలాంటి సందేశం ఇస్తోంది? ప్రభుత్వ అధికారం తన మనుషులనే కాపాడుతుందనా?" అని ప్రశ్నించింది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్