అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా చరిత్ర
ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.టెస్టుల్లోఅత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ రంగనా హెరాత్(433)రికార్డును అధిగమించాడు.బంగ్లాదేశ్‌తో డార్విన్‌లోని మరారా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్‌ను ఔట్ చేయడం ద్వారా స్టార్క్ తన టెస్టు వికెట్ల సంఖ్యను434కి పెంచుకున్నాడు.తన106వ టెస్టులో ఈ మైలురాయిని చేరుకున్న స్టార్క్,భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(434వికెట్లు)రికార్డును సమం చేశాడు.ప్రస్తుతం టెస్టుల్లో ఆల్-టైమ్ వికెట్ టేకర్ల జాబితాలో10వ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్(439)రికార్డును బద్దలు కొట్టడానికి స్టార్క్ కేవలం ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు రంగనా హెరాత్(433),పాకిస్థాన్ గ్రేట్ వసీం అక్రమ్(414),న్యూజిలాండ్ స్పిన్నర్ డానియల్ వెటోరి(362),శ్రీలంక పేసర్ చమిందా వాస్(355)తర్వాతి స్థానాల్లో ఉన్నారు.భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా348వికెట్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్లోటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్,బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి కేవలం198పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్ హసన్ మహమూద్55పరుగులిచ్చి6వికెట్లతో కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు.ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్(71)ఒక్కడే పోరాడాడు.








కామెంట్‌లు (0)