శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవ్‌ కోసమే నా భార్య క్రికెట్‌ చూస్తోంది!

1 గంట క్రితం

krishnamachari srikkanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై: భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ ఆట చూసేందుకే తన భార్య కూడా దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లను చూస్తోందని శ్రీకాంత్‌ చెప్పడం విశేషం. ఈ కుర్రాడి ప్రతిభ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోందని ఆయన పేర్కొన్నాడు.

“వైభవ్‌ ఆట అత్యద్భుతం. అతడిని నిరంతరం ప్రోత్సహించాలి. సరిగ్గా తీర్చిదిద్దితే రాబోయే రోజుల్లో అతడు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడు. టెస్టు క్రికెట్‌కు కూడా వైభవం తీసుకువస్తాడు. ఇప్పుడు దులీప్‌ ట్రోఫీని చూడటానికి కూడా అతడే ఒక కారణం. నా భార్య కూడా వైభవ్‌ ఉన్నాడనే మ్యాచ్‌లు చూస్తోంది” అని శ్రీకాంత్‌ వెల్లడించాడు.

ప్రపంచ క్రికెట్‌కు వైభవ్‌ పెద్ద ఆస్తిగా మారతాడని ఆయన అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లోనే అతడి సామర్థ్యం స్పష్టంగా కనిపించిందని, అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడగల సామర్థ్యం అతడికి ఉందా అనే సందేహమే అవసరం లేదని పేర్కొన్నాడు.

“వైభవ్‌ ఎక్కడైనా ఆడగలడు. త్వరలోనే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదుగుతాడు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లోనూ పేస్‌ బౌలింగ్‌ను ఏమాత్రం భయపడకుండా స్ట్రెయిట్‌గా సిక్స్‌లు కొట్టడం అతడి ప్రత్యేకత” అని శ్రీకాంత్‌ ప్రశంసించాడు.

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో వైభవ్‌ మెరుగైన బ్యాటింగ్‌తో తన జట్టుకు విజయాన్ని అందించడంతో అతడిపై ప్రశంసలు మరింత పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్