సొంతగడ్డపై భారత్ 'ఎ' జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు కెప్టెన్‌గా రైస్ మారియు వ్యవహరించనున్నాడు. అలాగే డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచెల్ హే, టిమ్ రాబిన్సన్, జేడెన్ లెనాక్స్ వంటి స్టార్ ప్లేయర్లకు జట్టులో చోటు దక్కింది. ఈ అనధికారిక మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించే ఆటగాళ్లకు భారత్ టెస్టు సిరీస్‌కు కివీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ వేదికగా అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. న్యూజిలాండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్, అనంతరం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత ఇరుజట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ మొదలు కానుంది.
Print Editionఇండియా-ఎతో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్-ఎ ప్రకటన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 10:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)