గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionNZ vs IND, 4th ODI: సిరీస్‌ ఇక్కడే సాధించాలి

17 నిమిషాల క్రితం

శ్రేయస్‌కు పగ్గాలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • శ్రేయస్‌కు పగ్గాలు

  • ఇషాన్ కిషన్‌, సిరాజ్‌ ఇన్..

  • గిల్, రాహుల్, కాంబోజ్ ఔట్‌

  • నేడు న్యూజిలాండ్‌తో నాల్గో వన్డే

  • ఉదయం 7.30గం.ల నుంచి

మౌంట్‌మొఘనాయ్‌(న్యూజిలాండ్‌): న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారతజట్టు సిరీస్‌పై దృష్టి సారించింది. తొలి రెండు వన్డేలను నెగ్గి 2-0 ఆధిక్యతలో ఉన్న దశలో వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ ఆధిక్యతలో ఉన్న భారతజట్టు శుక్రవారం జరిగిన నాల్గో వన్డేలో గెలిస్తే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకోనుంది. ఈ మ్యాచ్‌ మౌంట్ మొఘ నాయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో కనీసం మూడు మార్పులు చోటుచేసుకొని కివీస్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమ య్యేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. నాలుగో వన్డేకు గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బౌలర్ అన్‌షుల్ కాంబోజ్ కూడా అందుబాటులో ఉండడం లేదు. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి రావడం ఖాయం. ఇషాన్‌ వికెట్ కీపర్ బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో ఆడతాడనేది ఇంకా స్పష్టత లేదు. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. లేదంటే ఐదో స్థానంలో బరిలోకి దిగి మిడిలార్డర్ బాధ్యతలు తీసుకోవచ్చు. ప్రస్తుతం భారత టాప్-4 బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్ లేకపోవడంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ఆడించడం జట్టుకు ఉపయోగకరం. ఓపెనర్‌గా అతడికి మంచి రికార్డు ఉండటంతో రోహిత్‌కు జోడీగా పంపే అవకాశాలే ఎక్కువ. అయితే తుది నిర్ణయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకోనున్నారు.

‘హకా’ నృత్య ప్రదర్శనతో స్వాగతం...

మౌంట్ మౌంగనుయ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అక్కడి స్థానిక మావోరీ తెగ సభ్యులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, సంప్రదాయ 'హకా' నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. మౌంట్ మౌంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే జరగనున్న క్రమంలో మ్యాచ్‌కు ముందు, భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. న్యూజిలాండ్ స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా మావోరీ కళాకారులు తమ సంప్రదాయ పాటలు, హకా నృత్యంతో భారత ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టాండింగ్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ స్వాగతం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, కొత్త ఉత్సాహాన్ని నింపిందని జట్టు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు అక్కడికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దిగారు.

ఇక ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెనుకబడ్డ కివీస్‌ జట్టు చివరి రెండు మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను నిలపాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. భాగంగా భారత్ 2-0తో ఆధి క్యంలో నిలిచింది. తొలి రెండు వన్డేలు టీమిండియా నెగ్గగా, మూడో వన్డే వర్షార్ప ణమైంది. ఈ వన్డేలో భారత్‌ గెలిస్తే ఏడేళ్ల తర్వాత కివీస్‌పై మరోసారి సిరీస్‌ను సొంతం చేసుకోనుంది.

జట్లు(అంచనా)...

ఇండియా: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), కోహ్లి, గైక్వాడ్‌/తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌, అక్ష‍ర్‌ పటేల్‌, ఆకిబ్‌ నబీ, సిరాజ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ఆర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌: సాంట్నర్‌(కెప్టెన్‌), షెఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), అలెన్‌, యంగ్‌, నిక్‌ కెల్లీ, బ్రాస్‌వెల్‌, ఫాక్స్‌క్రాఫ్ట్‌, జేమీసన్‌, హెన్రీ, డఫీ, ఫిషెర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్