శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుట్టపర్తిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం- ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

1 గంట క్రితం

పుట్టపర్తిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పుట్టపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచారాన్ని పట్టణంలో శుక్రవారం చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించి పట్టణ సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలో అమడగూరు మండలంలో రూ.51 వేల కోట్లతో సోలార్ పరిశ్రమ రాబోతుందని. అలాగే పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. దీంతో వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందన్నారు.. అలాగే మహిళల కోసం త్వరలో గార్మెంట్ పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. మున్సిపాలిటీలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 136 కోట్లు మంజూరైనాయని టెండర్లు కూడా పూర్తి అయినాయని త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. మరో రూ.20 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో193 చెరువులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్ తో పాటు 28 వార్డుల సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి మాజీ మున్సిపల్ చైర్మన్లు పి సి గంగన్న, బెస్త చలపతి, కూటమినాయకులు మహమ్మద్ రఫీ, రామ లక్ష్మణ్, సామకోటి ఆదినారాయణ, పత్తి చంద్రశేఖర్, తోట్ల గంగాధర్, అబ్దుల్లా, కొండమ రాజు, హరికృష్ణ ఆయా వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్