శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిఖిల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

2 గంటల క్రితం

cricet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తొలి టి20లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ గెలుపు
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ జట్టు టి20ల్లోనూ నిరాశపరుస్తోంది. మెల్‌బోర్న్‌ స్టేడియంలో శనివారం జరిగిన తొలి టి20లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌, భారత సంతతికి చెందిన నిఖిల్‌ చౌదరి కట్టడి చేశాడు. బౌలింగ్‌లో 2వికెట్లతో రాణించిన నిఖిల్‌... బ్యాటింగ్‌లోనూ అర్ధసెంచరీతో మెరిసాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ బ్రూక్‌(65), బాంటెన్‌(39)కి తోడు కర్రన్‌(21), జోర్డాన్‌ కాక్స్‌(27) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆసీస్‌ బౌలర్లు నిఖిల్‌ చౌదరి, ఎడ్వర్డ్స్‌కు రెండేసి, డెవీస్‌, మెరిడిత్‌, డ్వార్షిస్‌, జంపాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 19.5ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయం సాధించింది. నిఖిల్‌ చౌదరి(66) అర్ధసెంచరీకి తోడు కెప్టెన్‌ మార్ష్‌(37), హార్పర్‌(32), ఎడ్వార్డ్స్‌(25నాటౌట్‌), టిమ్ డేవిడ్‌(20) బ్యాటింగ్‌లో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నిఖిల్‌ చౌదరికి లభించగా.. రెండో టి20 క్వీన్స్‌లాండ్‌ వేదికగా 24న జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్