ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో టీ20 ఓటమిపై విమర్శల వెల్లువ

2 గంటల క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మాంచెస్టర్‌ : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20నూ ఓటమి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ లక్ష్యంగా చేసుకుని ఈ వస్తున్నాయి. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో బంతి అందుకున్న స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఎవరూ ఊహించని రీతిలో నో బాల్స్‌ సంధించాడు. ఆ ఓవర్లో రెండు, ఓవరాల్‌గా మూడు నో బాల్స్‌ వేసిన బిష్ణోయ్‌ 6 బంతుల్లోనే 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే బౌలర్లు నో బాల్స్‌ వేయటం సహజమే. అందులో ఎక్కువగా పేసర్లు నో బాల్స్ వేస్తారు. ఫ్రంట్‌ ఫుట్‌ నో బాల్స్‌తో పాటు హైట్‌ నో బాల్స్‌ పేసర్లకు సాధారణం. కానీ స్పిన్నర్లు నో బాల్‌ వేయటం సాధారణ విషయం కాదని విమర్శలకు అంటున్నారు. అందులోనూ బ్యాక్‌ ఫుట్‌ నో బాల్స్‌ చెప్పనక్కర్లేదు. నెట్స్‌లో కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు అక్కడ రనప్‌ సవరించుకోకుండా నేరుగా మ్యాచ్‌లో కొత్త ప్రయోగాలు చేయటంతో రవి బిష్ణోయ్‌ ఏకంగా మూడు బ్యాక్‌ ఫుట్‌ నో బాల్స్‌ వేశాడని విమర్శిస్తున్నారు. అలాగే, ఐర్లాండ్‌ టూర్‌లో ఆడని రవి బిష్ణోయ్‌.. ఇంగ్లండ్‌‌తో టీ20 జట్టులోకి నేరుగా వచ్చేశాడు. ఇప్పడు ఇది వివాదానికి దారితీస్తోంది. సెలక్షన్‌ కమిటీతో పాటు బౌలింగ్‌ కోచ్‌ రవి బిష్ణోయ్‌ ప్రదర్శనకు బాధ్యత వహించే పరిస్థితి వచ్చింది. భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టీ20 మంగళవారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఓ వైపు టీ20 ప్రపంచకప్‌ విజయం సాధించిన కెప్టెన్‌, టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను పక్కనపెట్టిన టీమ్‌ ఇండియా నుంచి ఇటువంటి ప్రదర్శన ఎవరూ అంచనా వేయలేదు. మూడో టీ20లో భారత్‌ వరుస ఓటములకు బ్రేక్‌ వేయకుంటే, విమర్శలు మరింత పదునెక్కటం ఖాయం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్