న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో స్టార్ క్రికెటర్ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్‌జెయింట్స్‌కు సొంతమైన రిషబ్ పంత్.. రెండు సీజన్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరనున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా రెండు సీజన్లలో నిరాశపరిచిన రిషబ్ పంత్.. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేయర్ ట్రేడింగ్‌పై ఇప్పటికే చర్చలు జరపగా, అవి విజయవంతమైనట్టు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ఐపీఎల్ టైటిల్‌ను రెండు కంటే ఎక్కువ సార్లు నెగ్గిన జట్టు సైతం రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్‌జెయింట్స్‌ను సంప్రదించినా.. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిన రిషబ్ పంత్ ఆజట్టుకు నాయకుడిగా ఆకట్టుకున్నాడు. కారు ప్రమాదం జరిగిన ఏడాదిలోనూ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బాసటగా నిలిచింది.
సొంతగూటికి పంత్!
21 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)