ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా కీరన్ పోలార్డ్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. గతంలో ప్లేయర్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా ముంబయి ఇండియన్స్‌కు పోలార్డ్ సేవలు అందించాడు. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మహేళ జయవర్దనే తప్పుకోవడంతో.. అతని స్థానంలో పోలార్డ్‌కు పదోన్నతి కల్పించారు. ప్లేయర్ నుంచి కోచ్ స్థాయికి పోలార్డ్ ఎదిగినట్లు ముంబయి ఇండియన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2009-2010 సీజన్ నుంచి 2022 సీజన్ వరకు అతను ముంబయి జట్టులో ప్లేయర్‌గా కొనసాగాడు. ఐపీఎల్‌లో ముంబయి తరపున 189 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్.. 147.32 స్ట్రయిక్ రేట్‌తో 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 69 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్ బెస్ట్ 4/44గా ఉంది. 22 ఏళ్ల వయసులో పోలార్డ్ ముంబయి జట్టులో చేరాడని, 16 ఏళ్లుగా తమ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నాడని, ప్లేయర్‌గా, కోచ్‌గా తన అనుభవాలను పంచాడని, హెడ్‌కోచ్‌గా ఇప్పుడు పోలార్డ్ కొత్త బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Print Editionముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా పోలార్డ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 10:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)