మూడో వన్డేలో 6వికెట్ల తేడాతో యువ భారత్ గెలుపు
ఆస్ట్రేలియా (అండర్-19) జట్టుతో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
రాజ్‌కోట్: ఆస్ట్రేలియా (అండర్-19)తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ (అండర్-19) జట్లు క్లీన్‌స్వీప్ చేసింది. నిరంజన్ షా స్టేడియంలో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో 6వికెట్ల తేడాతో యువ భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా (అండర్-19) జట్టు 49.3ఓవర్లలో 254పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హోలిక్(87), నీల్ పటేల్(51), బ్లాక్ క్యాటీ(38) బ్యాటింగ్‌లో రాణించగా.. భారత బౌలర్లు మోహిత్, చౌహాన్‌కు మూడేసి, కావ్య పటేల్, ఆర్యన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో ఇండియా అండర్-19 ఓపెనర్, కెప్టెన్ ఎల్. రాజేశ్(110నాటౌట్)కి తోడు కుషగ్ర(45), రజత్(44నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. భారతజట్టు 41.2ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్. రాజేశ్‌కు దక్కింది. ఈ గెలుపుతో భారతజట్టు మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది.








కామెంట్‌లు (0)