ఆఫ్ఘనిస్తాన్ 343/9
ఐర్లాండ్‌తో నాల్గో వన్డే
బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్): ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, సెద్ధిఖుల్లా అటల్ సెంచరీలతో చెలరేగారు. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన నాల్గో వన్డేలో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గుర్బాజ్(12) నిరాశపరిచినా.. ఇబ్రహీం జడ్రాన్(102), సిద్ధిఖుల్లా అటల్(143) సెంచరీలో రాణించి 2వ వికెట్‌కు డబుల్ సెంచరీ (231పరుగులు) భాగస్వామాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రసూలీ(24) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లు మెక్ డొనాహ్‌కు మూడు, అడైర్, హోనీకి రెండేసి వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో ఐర్లాండ్‌జట్టు 35ఓవర్లు ముగిసేసరికి 4వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
జడ్రాన్ రికార్డు శతకం...
వన్డే క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ ఒక రికార్డును నమోదు చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా కేవలం 45 ఇన్నింగ్స్‌లోనే 2,000 పరుగులు పూర్తి చేసిన ఆఫ్ఘన్ తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్(38 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా-40 ఇన్నింగ్స్) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 45 ఇన్నింగ్స్‌లో 2000 పరుగులతో జడ్రాన్.. అబ్బాస్, బాబర్ ఆజం, కెవిన్ పీటర్సన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.







కామెంట్‌లు (0)