సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రైసిరీస్‌ విజేత సౌతాఫ్రికా

16 గంటల క్రితం

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఫైనల్లో 48 పరుగుల తేడాతో ఘనవిజయం

విండ్‌హొక్‌ : జింబాబ్వే, న‌మీబియాల‌తో జ‌రిగిన ట్రై సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. విండ్‌హొక్ వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 48 ప‌రుగుల తేడాతో జింబాబ్వేపై విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది._

ఓపెన‌ర్ జోర్డాన్ హెర్మ‌న్ (29 బంతుల్లో 53), డెవాల్డ్ బ్రెవిస్ (32), క‌న్నోర్ ఎస్త‌ర్‌హుజిన్ (32) రాణించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో న్యూమ‌న్ నైమూరి, బ్రాడ్ ఎవ‌న్స్ చెరో 2 వికెట్లు, సికంద‌ర్ ర‌జా ఒక వికెట్ తీశాడు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 18 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బ్రాడ్ ఎవ‌న్స్ (31 బంతుల్లో 56 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికీ మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌లమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్ల‌లో డాన్ జాసెన్‌, బోర్న్ ఫోర్టున్ చెరో 3 వికెట్లు తీయ‌గా, ఈథ‌న్ బోస్క్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మెరుపు అర్థ‌సెంచ‌రీ సాధిచిన జోర్డాన్ హెర్మ‌న్ "ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌" అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 226 ప‌రుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సాధించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్