బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటి20ల్లో శ్రీచరణి రికార్డు

14 గంటల క్రితం

sri charani.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐసిసి 804 రేటింగ్‌ పాయింట్లు సాధించిన

  • తొలి భారత బౌలర్‌.. మిథాలీరాజ్‌ రికార్డు బ్రేక్‌

దుబాయ్‌: టీమిండియా ఎడమచేతి వాటం స్పిన్నర్‌, తెలుగు తేజం శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్‌‌లో అంచనాలకు మించి రాణిస్తోంది. మహిళల ఆసియాకప్‌ ‌ఫైనల్లో శ్రీలంకపై 20పరుగులకు 4వికెట్లు తీసి టీమిండియా టైటిల్‌ ‌గెలుపులో కీలకపాత్ర పోషించిన శ్రీచరణి.. ఐసిసి బౌలర్ల జాబితాలోనూ సత్తా చాటింది. అంతర్జాతీయ క్రికెట్‌ ‌మండలి(ఐసిసి) తాజాగా విడుదల చేసిన బౌలర్ల జాబితాలో 804రేటింగ్‌ ‌పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీంతో 800కు పైగా రేటింగ్‌ ‌పాయింట్లకు పైగా సాధించిన తొలి భారత బౌలర్‌‌గా శ్రీచరణి రికార్డుల్లోకెక్కింది. ఇక ఆసియాకప్‌‌లో బ్యాటింగ్‌‌లో రాణించిన భారత స్టార్‌ ‌బ్యాటర్‌ ‌షెఫాలీ వర్మ టాప్‌-6‌కు ఎగబాకింఅంతర్జాతీయ క్రికెట్‌ ‌మండలి మహిళా క్రికెటర్లకు రేటింగ్‌ ‌ప్రకటించిన తర్వాత భారత్‌ ‌తరఫున బౌలింగ్‌, బ్యాటింగ్‌‌ విభాగాల్లో 800కు పైగా రేటింగ్‌ ‌పాయింట్లు ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేదు. 2011లో మిథాలీ రాజ్‌(780పాయింట్లు) ఇప్పటివరకు భారత్‌ ‌తరఫున అత్యధిక పాయింట్లు సాధించిన బ్యాటర్‌‌గా రికార్డుల్లో ఉంది. ఇక ఐసిసి ర్యాంకింగ్స్‌‌లో అత్యధిక పాయింట్లు సాధించిన ఆసీస్‌‌కు చెందిన మేగన్‌ ‌షట్‌ ‌సాధించిన 806రేటింగ్‌ ‌పాయింట్లకు శ్రీచరణి కేవలం 2 పాయింట్ల దూరంలో ఉంది. 2018లో మేగన్‌ ‌షట్‌ ఈ ఫీట్‌‌ను అందుకుంది. ఇక ఆసియాకప్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన దీప్తి శర్మ(14వికెట్లు) ర్యాంకింగ్స్‌‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 2వ స్థానంలో నిలిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్