మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ: సిరీస్‌పై టీమిండియా గురి

22 గంటల క్రితం

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 11:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేడు న్యూజిలాండ్‌తో మూడో వన్డే

- ఉదయం 7.30గం.ల నుంచి

హామిల్టన్‌: కివీస్‌ పర్యటనలో ఉన్న భార‌త్ జట్టు వన్డే సిరీస్‌ చేజిక్కించుకొనేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యతలో ఉన్న టీమిండియా.. మంగళవారం జరిగే మూడో వ‌న్డేలో గెలిస్తే మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. అదే జరిగితే కివీస్‌ గడ్డపై 2019 తర్వాత టీమిం డియా మరోసారి సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. అలాగే న్యూజిలాండ్‌ జట్టు 2019 నుంచి వ‌రుస‌గా ఓటమ‌న్న‌దే ఎరుగ‌కుండా వ‌రుస‌గా 11 వ‌న్డే సిరీస్‌లు నెగ్గిన రికార్డు బ్రేక్‌ కానుంది. దీంతో ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కివీస్‌ను వారి గ‌డ్డ‌పైనే ఓడించి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకునే స‌ద‌వకాశం టీమిండి యా ముంగిట నిలిచింది. కానీ నేటి వ‌న్డేకు వ‌రుణుడు ఆటంకం క‌లిగించే అవ‌కాశ‌ముంది. సోమ‌వారం హామిల్ట‌న్‌లో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఇండోర్ ప్రాక్టీస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిసిసిఐ భార‌త ఆట‌గాళ్లు ఇండోర్ నెట్స్‌లో సాధ‌న చేస్తున్న ఫొటోల‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'ఎడతెరిపి లేని వర్షాల కార‌ణంగా భారత జ‌ట్టు శిక్ష‌ణ‌ను ఔట్‌డోర్ నుంచి ఇండోర్‌కు మారింది' అని ఆ ఫొటోలకు క్యాప్ష‌న్ జ‌త చేసింది. ఇక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 10న హామిల్టన్‌లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రోజంతా సుమారు 20-45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 16-19 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 15-16 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది. దీంతో ఆకాశం మేఘావృతమై.. మ్యాచ్ నిర్వహణ కష్టమేనని ఆ ప్రకటనలో తెలిపింది. ఇక మూడో వన్డే ముగిసాక టెస్టు సిరీస్‌కు స‌న్నాహకాల్లో భాగంగా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ జ‌ట్టును వీడ‌నున్నాడు. అత‌డి స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్య బాధ్య‌త‌లు అందుకో నున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత జట్టు కివీస్‌తో జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే.

కివీస్‌కు గాయాల బెడద..

ఒక‌ప‌క్క వ‌రుస గాయాలు కివీస్‌ను కలవర పెడుతున్నాయి. స్టార్‌ ప్లేయర్లలో ఎక్కువమంది బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్‌ను కోల్పోయే ప్ర‌మాదం ఆ జ‌ట్టును వెంటాడు తోంది. కివీస్ పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలిస్తున్న దశలో, భారత పేసర్లు చెలరేగి బౌల్‌ చేస్తుంటే.. కివీస్‌ బౌలర్లు తేలిపోతున్నారు.

జ‌ట్టు(అంచ‌నా)....

భారత్: శుభ్‌మన్(కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయ‌స్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, అక్షర్, కాంబోజ్, అకిబ్, గుర్నూర్ బ్రార్‌, అర్ష్‌దీప్.

న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, సీఫెర్ట్, నికోల్స్, మిచెల్, ఫిలిప్స్, లాథమ్ (వికెట్ కీపర్), స్మిత్, జేమీసన్, మాట్ ఫిషర్, జాకబ్ డఫీ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్